చదవగానే నిజమా అనే సందేహం వచ్చేసి వుండాలి, ఇంక రాలేదు అంటే మీరు కచ్చితంగా కొత్తగా బ్లాగ్ లోకం లోకి వచ్చి వుండాలి లెదా మీరు చెన్నై లో వుండి వుండాలి ( వీళ్ళకి ఎమిటో అసలు అది కలలో కూడా అనిపించదు).
అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అంటే ఈ పోస్ట్ రాసేటప్పుడు మా ఆఫీసు లో ఏసి సరిగ్గా పని చెయ్యటం లేదు. పని చెయ్యకపోతే చల్లగా వుండటం ఇంటి అని ఇంకో సందేహం వచ్చి వుండాలి (ఎమిటో ఈ బ్లాగ్ లో వాళ్ళకి అన్ని సందేహాలే ). అది సరిగ్గా పని చెయ్యకపోతే ఇక్కడ మాకు temperature -10 లోకి పోతది (అది అసలు పనిచేయ్యకపోతే భయటి temperature కంటే రూం temperature భయంకరంగా వుంటది ఎందుకంటే ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం అని సెక్యూరిటీ వాడు కిటికీ తీయనివ్వడు) అదేకాక నిన్న వర్షం లో తడిసి రూం కి వెళ్ళిన అనుభవం అదేదో సినిమా లో ఏం.ఎస్. నారాయణ ఒక్క కప్ తో అప్పులన్నీ తీర్చేసినట్లు ఒక్క వానతో నాకు చెన్నై చల్లగానే వుంది అనిపించేసింది.
కొత్తగా మా ఆఫీసు ఒక పురాతన భవనం లోకి మార్చారు. పురాతన భవనం చూడగానే భయవేసి కొందరు రాజీనామా చేసి వెళ్ళిపోయారు (పారిపోయారు అని చదువుకోగలరు). కొంతమంది ఎప్పుడు లేనిది గుడిలో దణ్ణం వీలయితే భజన చేసి వస్తున్నారు. నాకంటే ఈ రాక్షసులతో పని చెయ్యటం అలవాటు అయ్యి దెయ్యాలు వీల్లకంటే దారుణంగా వుండవులే అని గట్టి నమ్మకం. ఇక కొత్త భవనం లోకి రాగానే తెలిసిన మొదటి వార్త్త ఏసి లేదు అని. ఒక వారం టేబుల్ ఫాన్స్ తో నేట్టుకోచ్చారు ( ప్లీజ్ ఎవరు కన్నీళ్లు పెట్టుకోవద్దు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో టేబుల్ ఫాన్స్ పెట్టుకు పని చెయ్యటం 100% నిజం). కాని ఆ తరువాత నుండి మొదలు ఈ ఏసి కష్టాలు. అదేంటో ఉక్క పోసి కిటికీ తియ్యగానే మా అన్నఫోన్ చేస్తాడు. మాటల్లోనే ఏరా రోడ్ మీద తిరుగుతున్నావా ఆఫీసు లో లేకుండా అంటాడు(మా ఆఫీసు పక్కనే గంటలో నాలుగు ట్రాఫిక్ జామ్స్ చూపించగల జెమిని బ్రిడ్జ్ వుండి మరి).
ఇంతలో కొలీగ్ ఒకడు కొత్త బిల్డింగ్ లో కాంటీన్ పెట్టారు అన్నాడు (మాకు పాత దానిలో కాంటీన్ కూడా లేదు). సరే చూద్దాము అని వెళ్లి జుస్ చెప్పాము. దెబ్బకి నాకు నా పాత కంపెనీ కాంటీన్ వాదు గుర్తుకొచ్చాడు. వాడు తొక్కలు కూడా కలిపి పంచదార లేకుండా జుస్ చేస్తాడు, వీడు తొక్కలు వెయ్యలేదు అంతే. పనిలో పనిగా లంచ్ డిన్నర్ వాడిని మరుస్తారేమో అని చూసాం, కాని పాత వాడే వచ్చాడు. వీడి వంటగాల్లు ఎంత ప్రావీన్యులు అంటే 200 మందికి అంటే వాళ్లు కచ్చితంగా 100 మందికే చేస్తారు కాని అది మా అందరికి చాలాసార్లు ఎక్కువ అవుతాది. ఇలా కాదులే బయట భోజనం చేద్దాం అని కొన్నాళ్ళు తిన్న, దానితో నా ఫాంట్స్ అన్నీ స్టీల్ సామాను వాడికి వేసి కొత్తవి కొనుక్కోవలిసి వచ్చింది. నెలకోసారి కొత్త బట్టలు కొనటం కష్టం నష్టం అని మల్లి ఆఫీసు లోనే తినటం మొదలెట్టా.
ప్రస్తుతానికి ఇలా సాగుతూ వుంది. ఇక నేను కూడా కాసేపు ఆ ట్రాఫిక్ జామ్ లో డాన్స్ చేసి (బైక్ తో) అలా ఇంటికి పోతా ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్లు:
మహానుభావా ఆ అంకెలు కూడా తెలుగే రాయాలా? అవి మనవే బాబు అవేమీ అప్రాచ్యం కావు, హిందూ అరబిక్ సంఖ్యలవి. లేక అరవాభిమానమెమైనా పట్టుకుందా. ఇంతకీ మీ కంపెనీ పేరేంటొ క్లూ ఐనా ఇవ్వలేదు? ఇస్తే జాగ్రత్త పడతాం కదా...
అలెఖ్య గారు కాదులెండి,మనవాడు షిఫ్టు పట్టుకుని లేక యఫ్ లెవెన్ నొక్కటానికి బద్దకించాడు.అది జరిగిన సంగతి
@Alekya- I dont know which is telugu and which is hindu arabic letters, can u explain clear???
@Devarapalli- I tried type using shift nothing happened and if i press F11 it is showing full window. can u suggest me any other ways??
ఇప్పుడు మీరు రాసిన అంకెల్నే (0,1,2,3,4,5,6,7,8,9 అన్నమాట) హిందూ అరబిచ్ సంఖ్యలంటారు. ఇక పోతే మీరు తెలుగు type చెయ్యడానికి ఏ software వాడుతున్నారు?
baraha.com
నుంచి బరహ దించుకుని రెచ్చి పొయ్యి పిచ్చకొట్టుడు కొట్టటమే
అందులో యప్ లెవెన్ ఒకసారి నొక్కితే తెలుగు మరోసారి క్లిక్కితే english అంతే సింపుల్
కామెంట్‌ను పోస్ట్ చేయండి