18, అక్టోబర్ 2009, ఆదివారం

చెన్నై ట్రాఫిక్

ఎప్పటి లానే చండలమయిన అన్నలక్ష్మి లంచ్ తిని ఆఫీసు పక్క సందులో నుండి వినిపిస్తున్న చండలమయిన పాటలు వింటూ వుండగా కొలీగు బ్యాంకు కి పోదామా అన్నాడు. వెంటనే ముందు నుయ్యి వెనక గొయ్యి సామెత గుర్తోచింది. చెన్నై ఎండలో బండి తోలటం అంటే నరకాని బ్లాకు లో టికెట్ కొనుక్కున్నట్లే. కాని పక్క సందులో పాటలు వింటున్న కొద్ది బ్లాకు లో టికెట్ కొనుక్కోవటమే బెటర్ అనిపించింది .
మా కంపెనీ పక్కనే చిన్న స్లం ఏరియా వుంటది. అందులో వారానికి ౩ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ప్రతి సారి మైక్ లో పెద్దగ రోజంతా పాటలు పెట్టటం వాటి దెబ్బకి మాకు రాత్రికి ఇంటికి వెళ్ళేసరికి చెవులు చిల్లులు పడటం మాకు మామూలే . వాటి దెబ్బ తట్టుకోలేక మా ఆఫీసు వాళ్లు ఒకసారి వెళ్లి 'మీరు ఇలా వారానికి ౩ సార్లు పెద్దగ సినిమా పాటలు పెట్టటం ఏమి బాగోలేదు' అన్నారు. నెక్స్ట్ డే నుండి రొజూ మైక్ పెట్టి వాళ్ళే పాటలు పాడటం మొదలెట్టారు. మా వాళ్ళు వెళ్లి అడిగితే మీరు చెప్పినట్లే చేస్తున్నాం కదా అన్నారు (అందుకే చెన్నై వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన చెప్పేది క్లియర్ గ వుండాలి అంటారు). దానితో మా వాళ్ళు తిరిగి వచ్చి ఆ రొజూ పీకేయల్సిన వాళ్ళని పిలిచి వాళ్లు పాడుతున్నారో లేక మనల్ని తిడుతున్నారో కనుకోటానికిఒక సాఫ్ట్వేర్ రాస్తేనే వుంచుకుంతం అని చెప్పారు.
సరే అది వేరే కథ, ఆ రొజూ బ్యాంకు కు వెళ్లి వచ్చాక చెన్నై ట్రాఫిక్ మీద బ్లాగ్ ఎండకు రాయకూడదు అనిపించింది.
నేను చెన్నై లో బండి తోలటం మొదలెట్టిన కాడి నుండి చెన్నై ట్రాఫిక్ మీద సదాభిప్రాయం లేదు.
ముందుగా బస్ ల గురుంచి చెప్పుకుందాం. చెన్నై లో బస్ లు డి. టి. ఎస్ వి. అవి చేసే సౌండ్ కి బస్ దిగే సరికి చెవుల్లో సీసం పోసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఈ మధ్య కొంచం మంచివి వచ్చాయి. ఇక బస్ డ్రైవర్ అప్పుడు ఫ్లైట్ దిగోచిన పైలట్ లాగా ఫీల్ అవుతుంటాడు. బస్ స్పీడ్ అరవై తగ్గితే అతని బి.పి పెరిగి పోతాది. చాల బస్ స్టాప్ లు అర కిలోమీటరు పొడవునా విశాలంగా వుంటాయి. కాని దానిలో బస్ ఆపటం గుళ్ళోకి చెప్పులేసుకేల్లినంత తప్పుగా ఫీల్ అవుతుంటారు. బస్ ని రోడ్ కి మధ్యలో ఆపి వెనకాల అర కిలోమీటరు ఆగిన ట్రాఫిక్ ని చూడటం సరదా. ఇక సిగ్నల్ దగ్గర బస్ పక్కన బస్ ఆపటం, సిగ్నల్ వదిలాక నువ్వా నేనా అని పోటి పెట్టుకుని వెనకాల ఎవ్వరికి దారి ఇవ్వకపోవటం, ముందు వెళుతున్న వాటిని క్రాస్ చెయ్యటానికి సడన్ రైట్ తిప్పటం, కొన్ని సార్లు అసలు ఎటు వేలుతున్నమో వెనక వాళ్ళకి సిగ్నల్ ఇవ్వకుండా రైట్/లెఫ్ట్ తిప్పటం వీళ్ళ సరదాల్లో కొన్ని.
ఇక లారీ లు, వీళ్ళ గురుంచి పెద్దగ చెప్పలేను కాని నైట్ టైం లో వీళ్ళు తోలుడు చూస్తే ఒక్కోసారి భయం ఒక్కోసారి కోపం వస్తాయి. అరవై లో వెళ్తున్న వాడు నువ్ సడెన్ బ్రేఅక్ వెయ్యకపోతే చచ్చేంత స్పీడ్ గ టర్న్ చేస్తాడు. లేకపోతే ముందు నలభై మీద వెళ్తున్న వాడిని నలభై ఒకటి స్పీడ్ తత్త్ క్రాస్ చేస్తూ వెనకాల వాళ్ళు అంత వేసే హారన్ ని చప్పట్లు లాగా వింటూ వుంటాడు. జి.ఎస్.టి రోడ్ లో జరిగే ఆక్సిడెంట్ కి కేవలం లారీ వాళ్ళే కారణం అని చాలా సర్వే లు చెబుతాయి.
తప్పు మనదే అని తెలిసిన ఎదుటి వాడినే తిట్టుకోవటం చెన్నై కార్ డ్రైవర్స్ కే చెల్లుతుంది. కార్ తోలేవాళ్ళు కాక మిగతా వాళ్ల వల్లే ట్రాఫిక్ జాం అవుతుందని వ్రొంగ్ సైడ్ లో కారు ఆపి మరీ తిట్టుకోవటం వీళ్ళకే చెల్లుతుంది. సాదారణంగా రెండు బస్/కార్ ల మధ్య కార్ పట్టని కాలి వున్నా వేరేవాళ్ళని వెళ్లనీకుండా ఆ ప్లేస్ లో కారు ఆపి సంతోషపడుతుంటారు. ట్రాఫిక్ లో వీళ్ళు వేసే హరన్ వింటుంటే కార్ మీద పెట్రోల్ పోసి తగలేట్టాలి అనిపిస్తుంది. ఎదుటి వాడికి ఎటు పోవటానికి దారి లేదని తెలిసిన హరన్ కొడుతూనే వుండటం వీళ్ళ ప్రత్యేకత.
చెన్నై ఆటో ల గురుంచి ఎంత చెప్పినా తక్కువే. నాకు తెలిసి వీళ్ళ డ్రైవింగ్ గురుంచి తెలీని వాళ్లు వుండరు. చెన్నై లో తొంభై శాతం చిన్న చిన్న ఆక్సిడెంట్ ఆటో ల వల్లే జరుగుతాయి. కాని అది ఆటో వాడికి తెలీదు. ఎందుకంటే వెనకాల ఆక్సిడెంట్ జరిగిన సంగతి ముందు ఆటో వాడు చూడదు, చూసిన ఆగదు. ఇక రోడ్ కాలిగా వుండి అంటే వీడి సర్కస్ చూడటానికి ధైర్యం చాలదు. వీడు ఎంత షార్ప్ గ రైట్/లెఫ్ట్ తిప్పుతాడు అంటే వెనకాల వుంటే మీకు డ్రైవింగ్ మీద విరక్తి పుట్టటం ఖాయం. మీ బ్రేక్ కనక కండిషన్ లో లేకపోతే ఆటో/లారీ వాడు తిప్పే తిప్పుడుకి ముందు గుండెల్లో దడ, ఆ తర్వాత వొల్లంత చమటలు, తర్వాత నడుములో వణుకు, కళ్ళ ముందు అయిదు లేక ఆరు చుక్కలు, ఆక్సిడెంట్ అవకపోతే మీరు ఎప్పుడో కింద పడేసిన మరదలు గుర్తొస్తారు (అసలు ఆ అమ్మాయి ని బైక్ మీద నుండి పదేసినందుకే ఇలా జరిగింది అనిపిస్తుంది ) . నిజం కావాలంటే ఎప్పుడయినా అందమయిన అమ్మాయిని అయిదు కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్తూ పడేసి చూడండి, మల్లి మీకు ఆ బైక్ పట్టుకోవాలని కూడా అనిపించదు. అందుకే నేను కూడా అప్పటిదాకా బేవార్స్ గ వాడుతున్న ఫ్రెండ్ బైక్ వదిలేసి వేరేది తీసుకున్న.

ఇక చెప్పుకోవలిసింది బైక్ ల వాళ్ల గురుంచి. వీళ్ళ గురుంచి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వీళ్ళలో నేను ఒకడిని. నన్ను నేను తిట్టుకోవటం అంత బాగుండదు కదా?? :)

5 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

రెండేళ్ళ క్రితం వరకూ బైక్ ని చాలా ఇష్టపడే మా అబ్బాయి రోజూ ట్రాఫిక్ చూసి జన్మలో బైక్ కొనను అంటున్నాడు. పిల్లల అభిప్రాయాలు మారతాయనుకోండి. అయినా నిజం అదే.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

బాగా రాసారండి..
మీ పాత టపాలు కూడా చదివాను..బాగున్నాయి..
మరెందుకు ఇంత గేప్ ఇచ్చి రాస్తున్నారు? మనలో మన మాట తెలుగులో బ్లాగడం మానేసి అరవంలో అరవడం(అదేనండీ బ్లాగడం) మొదలెట్టరా ఏంటి? :)

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

మొత్తానికి, మీ చెన్నై కష్టాలు బాగున్నాయి అండి! మీరు వర్క్ చేసేది జెమిని బ్రిడ్జి దగ్గరా?

Unknown చెప్పారు...

dint have time to read all through..this is a nice thought..wish u all d best.

Rajesh Singarapu చెప్పారు...

ఎప్పట్లాగె చందలంగ ఉన్న అన్నలక్ష్మి ని తిని ......
ఇదెదో బెతాల కథ లాగ రాసారు ....
చాలా బాగుంది